జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

18-10-2026 | 01:54pm

పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.. బతుకమ్మల తయారీలో మహిళలు బిజీ

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల మార్కెట్లు రంగురంగుల పూలతో కళకళలాడుతున్నాయి. బతుకమ్మ పేర్చేందుకు అవసరమైన తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలు పెద్ద ఎత్తున మార్కెట్లకు చేరడంతో కొనుగోలుదారుల సందడి నెలకొంది.

తెల్లవారుజాము నుంచే మహిళలు మార్కెట్లకు చేరుకుని పూలను కొనుగోలు చేస్తున్నారు. ఇళ్ల వద్ద సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను అందంగా పేర్చడంలో నిమగ్నమయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సాయంత్రం బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆటపాటలతో వేడుకలు నిర్వహించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు