వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షం
18-10-2026 | 03:17pm
మల్లాపూర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం ఓబులాపూర్ తండా చెరువు సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో మొసలి(Crocodile) కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అటుగా వెళ్తున్న రైతులు బావిలో మొసలిని గమనించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేయడంతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షం కావడంతో రైతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి మొసలిని సురక్షితంగా బయటకు తీసుకెళ్లాలని స్థానికులు కోరుతున్నారు.