బీజేపీ ములుగు మండల అధ్యక్ష పదవికి లక్ష్మణ్ గౌడ్ రాజీనామా

18-10-2026 | 02:26pm

గజ్వేల్ అక్టోబర్ 18: భారతీయ జనతా పార్టీ (BJP) ములుగు మండల అధ్యక్ష బాధ్యతలకు కే. లక్ష్మణ్ గౌడ్(K. Laxman Goud) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ కి అధికారికంగా పంపినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఇటీవల ప్రకటించిన బీజేవైఎం ములుగు మండల అధ్యక్షుడి నియామక ప్రక్రియలో మండల అధ్యక్షుడిగా ఉన్న తనను ఏమాత్రం సంప్రదించలేదని, తన అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో, అంకితభావంతో పనిచేస్తున్న నిజమైన కార్యకర్తకు ఈ నియామకంలో అన్యాయం జరిగిందని, పార్టీ అంతర్గత సంప్రదింపులు లేకుండా, ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, అందుకే మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా జిల్లా అధ్యక్షులను కోరుతున్నానని లక్ష్మణ్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ రాజీనామా పత్రం ప్రతులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, అలాగే మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావుకి సమాచారం నిమిత్తం పంపినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు