వర్గ పోరు తట్టుకోలేక కాచవరం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

12-10-2026 | 05:25am
  1. గ్రామాభివృద్ధికి మరొక వర్గం సహకరించడం లేదని ఆవేదన
  2. అంతర్గత పోరుతో మండలంలోని కొన్ని  గ్రామాలలో ఇదే పరిస్థితి
  3. వర్గ పోరుతో ఆగిపోతున్న అభివృద్ధి పనులు

ఎర్రుపాలెం, అక్టోబర్ 11 (విజయ క్రాంతి): మండల పరిధిలోని కాచవరం గ్రామ సర్పంచ్ షేక్ ఫాతిమాభి వర్గ పోరు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీకి(Congress Party) రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. తన స్వగృహంలో శనివారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను తమ కుటుంబం గత 20 సంవత్సరాల నుండి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విధేయుడు విధేయులుగా ఉన్నామని గతంలో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయామని పార్టీని వేడకుండా పార్టీలోనే కొనసాగామని తెలిపారు.

గత గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామం లోని అన్ని పార్టీల నాయకులు కలిసి తనకు పూర్తీ మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించారని తెలిపారు తాను సర్పంచ్ గా ఎన్నికైన నాటినుండి గ్రామంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు తనకు సహకరించక పోగా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన చెందారు.

గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీలోని మరొక వర్గం తనను పనులు చేయకుండా ఆటగిస్తూ పనులకు ఆటంక కలిగిస్తున్నారని ఆమె తెలిపారు ఈ విషయాన్ని మండల స్థాయి కాంగ్రెస్ నాయకులకు ఎన్నోసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు తెలిపారు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో సంక్షేమ పథకాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంటే మిగిలిన కాంగ్రెస్ నాయకులు అడ్డదగులుతూ తనకు సహకరించడం లేదని అన్నారు.

ఇదే విషయాన్ని మండల అధ్యక్షుడు నుంచి  గ్రామ కాంగ్రెస్ నాయకులకు తెలిపిన ఫలితం లేకపోవడంతో ఆవేదనతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. త్వరలో ఉపముఖ్యమంత్రి బట్టి భట్టి విక్రమార్కుని కలిసి నివేదిస్తానని పేర్కొన్నారు. సర్పంచిగా గ్రామ అభివృద్ధికి పనిచేస్తానని వివరించారు. మండలంలోని కొన్ని గ్రామాలలో వర్గ పోరుతో ఇదే పరిస్థితి కనబడుతోంది. అంతర్గత పోరుతో గ్రామాలలో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి.


మరిన్ని వార్తలు