భూ రీ సర్వేను పరిశీలించిన తహసీల్దార్
కల్లూరు, అక్టోబర్ 03 (విజయక్రాంతి): కల్లూరు మండలం(Kallur Mandal) రఘునాథగూడెంలో కొనసాగుతున్న భూ రీ సర్వేను(Land Resurvey) తహసీల్దార్ బ్రహ్మేశ్వరరావు(Tahsildar Brahmeswara Rao) శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వే ప్రక్రియను త్వరగా,ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చేయాలని సర్వే సిబ్బందికి సూచించారు. రైతులకు(farmer) ముందస్తుగా సమాచారం అందించి,భూముల సరిహద్దుల్లో గుర్తింపు జెండాలు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని సర్వే బృందాన్ని ఆదేశించారు. రైతులు(farmer) తమ భూములకు సంబంధించిన సరైన పత్రాలతో సర్వే ప్రాంతానికి హాజరై,సర్వే ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని తహసీల్దార్ కోరారు.కార్యక్రమంలో జీపీఓ రాంబాయి,సర్వేయర్లు,గ్రామ పెద్దలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.