సత్యనారాయణపురం గ్రామంలో వైద్య శిబిరం

27-10-2026 | 07:59pm

ఎర్రుపాలెం అక్టోబర్ 27 (విజయక్రాంతి): బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సత్యనారాయణపురం గ్రామంలో వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ అశ్విని ఆధ్వర్యంలో వైద్యశిబిరం(Medical Camp) ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, బి.పి, షుగర్ వంటి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న 79 మందికి పరీక్షలు జరిపి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసి ప్రజలకు తరుణి వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండ్ల రాణి, మండల కాంగ్రెస్ నాయకులు ఆత్మ ప్రసాద్, హెచ్ ఈ ఓ భాస్కరరావు, సూపర్ వైజర్ కొండయ్య, ఏఎన్ఎం నాగమణి, నరేష్ ఆశా కార్యకర్తలు వీరమ్మ, సంధ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు