సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన బిజెపి నాయకులు
04-10-2026 | 05:17pm
చేగుంట అక్టోబర్ 04,విజయక్రాంతి : మాసాయిపేట మండలంలోని(Masaipet Mandal) చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బట్టి యాదగౌడ్ కి, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సహకారంతో మంజూరైన (33000) రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మాసాయిపేట మండల బీజేపీ అధ్యక్షులు ములుగు నాగేందర్ రెడ్డీ అందజేశారు.
ఈ కార్యక్రమం లో ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఆకారం బాబు, పోతనశెట్టిపల్లి సర్పంచ్ ఉప్పల ప్రశాంత్, మండల ప్రధాన కార్యదర్శి ఏశం నవీన్ యాదవ్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.