పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ

04-10-2026 | 05:12pm

మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్,అక్టోబర్ 4 (విజయక్రాంతి) : మండల పరిధిలోని సల్కర్‌పేట్ గ్రామంలో(Salkarpet Village) ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు(Installation of Sayanna Statue) ఆదివారం భూమిపూజ నిర్వహించారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల పెద్దలు, గ్రామ పెద్దలు ఏకమై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అక్టోబర్ 22న పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కృషి చేస్తున్న నేపథ్యంలో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని కులాల పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ సహకారం అందిస్తామని తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు