కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

04-10-2026 | 05:09pm

చేగుంట అక్టోబర్ 04, (విజయక్రాంతి) :  కరెంట్ షాక్(Electric shock) తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామం లో చోటి చేసుకుంది, చేగుంట పోలీస్(Chegunta Police) ల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అన్నం యాదగిరి(Annam Yadagiri) (50) తన వ్యవసాయ పొలంలో కొడవలితో గడ్డి కోస్తుండగా, పక్కనే ఉన్న కరెంటు వైర్  కొడవలికి  తగలడంతో  అక్కడికక్కడే మృతి చందాడు. విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు సంఘటన చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

మరిన్ని వార్తలు