సినీ దిగ్గజానికి తుది వీడ్కోలు
భారతీయ సినిమా ప్రయోగాలకు తనదైన శైలిని అద్దిన లెజెండరీ ఫిలింమేకర్ సింగీతం శ్రీనివాసరావుకు(Singeetam Srinivasa Rao) తుది వీడ్కోలు పలికారు. 94 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో విషాదంలో మునిగిన సినీ లోకం.. ఆదివారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు పూర్తవడంతో మరోసారి భావోద్వేగానికి లోనైంది. నేసపాక్కం శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న సింగీతం శ్రీనివాసరావు శనివారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని విరుగంబాక్కంలోని నివాసానికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం నుంచే సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని చివరి చూపు చూసి నివాళులర్పించారు.
కమల్ హాసన్ తీవ్ర భావోద్వేగం
సింగీతం శ్రీనివాసరావుతో ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో కలిసి పనిచేసిన విశ్వనటుడు కమల్ హాసన్( Kamal Haasan) ఆయన నివాసానికి చేరుకున్నారు. సింగీతం పార్థివదేహాన్ని(Singeetam Srinivasa Rao Funeral) సందర్శించిన కమల్ హాసన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరిద్దరి సినీ ప్రయాణంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
ప్రయోగాలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు
Legendary Director Singeetam మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక శకం ముగిసినట్లైంది. మూస ధోరణులకు భిన్నంగా ఆలోచిస్తూ.. కథ, కథనం, సాంకేతికత విషయంలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు. అందుకే Singeetam Srinivasa Rao పేరు భారతీయ సినిమా ప్రయోగాత్మక దర్శకుల జాబితాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు తదితరులు సింగీతం మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు. సింగీతం శ్రీనివాసరావు భౌతికంగా దూరమైనా.. ఆయన తెరకెక్కించిన విభిన్న కథలు, చేసిన ప్రయోగాలు, భారతీయ సినిమాకు అందించిన సృజనాత్మక దిశ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. Singeetam Srinivasa Rao Funeralతో ఆయన చివరి ప్రయాణం ముగిసినా.. సినీ చరిత్రలో ఆయన వేసిన ముద్ర మాత్రం చెరిగిపోనిదే.