పరిసరాల పరిశుభ్రత పాటించాలి
29-10-2026 | 09:20pm
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వార్డును శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్(Asifabad Municipal Vice Chairman MD Ahmed) కోరారు. గురువారం పట్టణంలోని 17వ వార్డులో పారిశుద్ధ్య పనులను శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామయ్య(Sanitary Inspector Ramayya), కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. చెత్తను రోడ్లపై, మురుగు కాలువల్లో వేయవద్దని, పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నల్గొండ శ్రీరాములు, అనుమండ్ల శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.