పాఠశాలలో బతుకమ్మ సంబరం
09-10-2026 | 09:46pm
సిర్పూర్ -యు (విజయక్రాంతి) : మండల కేంద్రంలోని ఎంపిపిఎస్, జడ్పి ఎచ్ ఎస్ పాఠశాలల్లో(ZP HS School) బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి అధ్యాపకులు సంప్రదాయ పండుగకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు(Special prayers for Bathukamma) నిర్వహించిన చిన్నారులు, విద్యార్థులు(Students).. బతుకమ్మ పాటల తాళానికి అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పూల పండుగ గొప్పతనాన్ని చాటుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను(Telangana culture and traditions) ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలతో పాఠశాల ప్రాంగణాలు పూలవనాలను తలపించాయి.