హామీల అమలుకు కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్ నిరసన

08-09-2026 | 05:25am

ఆసిఫాబాద్ , సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు, గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సో మవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్కు వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కలెక్టరే ట్ ఎదుట ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో హామీల ను అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు పూర్తయినా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు.

మహాలక్ష్మి ప థకం కింద మహిళలకు ఆర్థిక సాయం, రైతు భరోసా, పంటలకు బోనస్, రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, విద్యా భ రోసా, పెండింగ్ ఫీజు బకాయిల చెల్లింపు, పెంచిన పింఛన్లు తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశా రు. ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకుని అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని నాయకులు పేర్కొన్నారు.

ప్రజాస్వా మ్యబద్ధంగా అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎ మ్మెల్యేలను అరెస్టు చేయడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్ని ఇ బ్బందులు ఎదురైనా ప్రజల తరఫున పోరా టం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు మార్సకోల సరస్వతి, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, కౌన్సిలర్లు సలాం, బాలకృష్ణ, రాజంపేట సర్పంచ్ పోచయ్య, మండల అధ్యక్షుడు రవీందర్, టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, నాయకులు నిస్సార్, సాంగ్డే జీవన్, ఆన్సర్, గుండా శ్యామ్, పొన్నాల నారాయణ, దూడల అశోక్, జయరాజ్, ఆశన్న, హకీమ్, భీమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు