తెలంగాణలో నేడు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్

08-09-2026 | 07:34am

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌(Fee Reimbursement) బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ పాటిస్తున్నాయి. TPDMA ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను ఉధృతం చేసి నిరవధిక సమ్మెకు దిగుతామని సంఘం హెచ్చరించింది. సెప్టెంబర్‌ 9న వివిధ పట్టణాల్లో మానవహారాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా, బకాయిల విడుదల కోరుతూ సెప్టెంబర్‌ 4న హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో విద్యార్థులు కూడా ఆందోళన చేపట్టారు.

మరిన్ని వార్తలు