కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు జి.వి.హౌస్ అరెస్ట్
కరీంనగర్, సెప్టెంబరే08(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షుడు జి.వి. రామకృష్ణ రావును మంగళవారం తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా మానకొండూర్లోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.అలాగే జిల్లాలో పలువురు బి ఆర్ ఎస్ జిల్లా, మండల స్థాయి నాయకులను కూడా ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.
బి ఆర్ ఎస్ నాయకులపై జరుగుతున్న అక్రమ హౌస్ అరెస్టులు, ముందస్తు అరెస్టులను జి.వి. రామకృష్ణ రావు తీవ్రంగా ఖండించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో ముందస్తు నిర్బంధంలో ఉన్న నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అధికార పార్టీ చర్యలు, ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించింది. అయితే ఈ నిరసన కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే మా పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని, వెంటనే అన్ని అరెస్టులను నిలిపివేసి నిర్బంధంలో ఉన్న నాయకులను విడుదల చేయాలని జి.వి. రామకృష్ణ రావు డిమాండ్ చేశారు.
