అనుమతి తీసుకుందాం.. పండుగ చేసుకుందాం

08-09-2026 | 09:50am

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), సెప్టెంబర్ 7: గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అర్వపల్లి ఎస్‌ఐ పి. మధు(SI P. Madhu) సూచించారు. రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయకుండా, పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. మండపాల వివరాలను పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేస్తే ప్రతి విగ్రహానికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తామని తెలిపారు. ఉత్సవ కమిటీలు పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు