జిల్లా టాపర్‌కు రూ.2 లక్షల బహుమతి

21-09-2026 | 05:52pm

వాంకిడి, (విజయక్రాంతి): మండలంలోని ఇంధాని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల(Indhani ZPHS High School) పూర్వ విద్యార్థిని బిశ్వాస్‌ దేబిక జిల్లా టాపర్‌గా నిలిచి రూ.2 లక్షల నగదు పురస్కారానికి ఎంపికైంది. 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 560 మార్కులు సాధించి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా టాపర్‌గా నిలిచింది. ‘చదువుకో తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అందిస్తున్న ఈ పురస్కారాన్ని ఈ నెల 24న రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అందుకోనుంది. ప్రస్తుతం దేబిక మందమర్రి తెలంగాణ మోడల్ స్కూల్‌లో చదువుతోంది. ఆమెను పాఠశాల హెచ్‌ఎం, ఎంఈఓ శివచరణ్ కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

మరిన్ని వార్తలు