సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

05-10-2026 | 03:55pm

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): మెదడుకు సంబంధించిన అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రి(NIMS Hospital)లో చికిత్స పొందుతున్న కాగజ్‌నగర్‌ ఓల్డ్‌కాలనీకి చెందిన సంగు స్వప్న కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. సోమవారం కాగజ్‌నగర్‌లోని తన కార్యాలయంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు(MLA Dr. Palvai Harish Babu) మంజూరైన సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

మరిన్ని వార్తలు