జోనల్ స్థాయి పోటీలకు డీఏవీ విద్యార్థుల ఎంపిక
16-09-2026 | 06:37pm
కాగజ్‌నగర్ (విజయక్రాంతి): సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని డీఏవీ లక్ష్మీపతి సింఘానియా పబ్లిక్ స్కూల్(DAV Lakshmipat Singhania Public School) విద్యార్థులు ఎస్జీఎఫ్ఐ జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అంబదాస్ రావు, వ్యాయామ ఉపాధ్యాయులు బాలకృష్ణ తెలిపారు.
ఈ నెల 9న ఆసిఫాబాద్ గిరిజన క్రీడా పాఠశాలలో నిర్వహించిన అండర్–14, అండర్–17 బాలబాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో డీఏవీ విద్యార్థులు ప్రతిభ చాటారు. అండర్–14 బాలికల విభాగంలో వర్షిత సహారే, ఆరాధ్య, నమ్రత, శ్రీష్మ, అండర్–17 బాలికల విభాగంలో సింధూర, అండర్–14 బాలుర విభాగంలో రోహన్ సరోజ్, పీయూష్, సహర్ష్ జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.జోనల్ స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.