గిరిజన రిజర్వేషన్ల పెంపు ఘనత కేసీఆర్‌దే.. పాలాభిషేకం చేయాలి: సండ్ర
కల్లూరు సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(Former Sathupalli MLA Sandra Venkata Veeraiah) పిలుపునిచ్చారు.
గిరిజనులు, ఆదివాసీలు, తండాల్లో నివసించే లంబాడీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రయోజనం కల్పించేలా రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేసుకుంటూ పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాలని సండ్ర కోరారు.
తెలంగాణ ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 30న ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్కినేని రఘు పెడకండి రామకృష్ణ, కొరకొప్పు ప్రసాద్ సర్పంచ్ గుగులోతు శ్రీను, మాజి సర్పంచులు మాన్సింగ్, శ్రీను, లక్ష్మణ్,జర్పుల లీలావతి, బాలు,రామయ్య, భూక్య జాన్ ప్రసాద్, బానోతు నేపాల్ కృష్ణ, బానోతు రాములు, కృష్ణ జమలయ్య, సాయి భరత్, ప్రసాద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.