వైద్యం కోసం సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

23-09-2026 | 08:14pm

కాగజ్‌నగర్, సెప్టెంబర్‌ 23 (విజయక్రాంతి): కాగజ్‌నగర్‌ మండలం కొత్త సార్సాల గ్రామానికి చెందిన పుల్ల అంజయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.25 లక్షల చెక్కును సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పి. హరీశ్‌బాబు(MLA Dr. P. Harish Babu) బుధవారం పంపిణీ చేశారు. కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతున్న అంజయ్యకు వైద్య ఖర్చుల కోసం ఈ సాయం మంజూరైంది. 

మరిన్ని వార్తలు