"ఎల్నినో ప్రభావం" పై రైతులకు అవగాహన సదస్సు
కాగజ్నగర్ ,అక్టోబర్ 23 (విజయ క్రాంతి):ఎల్మినో(El Nino) ప్రభావం కారణంగా రైతులు తమ వ్యవసాయ సాగు విధానంలో మార్పులు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. శుక్రవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని మోసం గ్రామపంచాయతీ పరిధిలోగల ఆరెగూడ గ్రామంలో శుక్రవారం "కేత్ బచావో అభయాన్"రైతు సదస్సులో ఏడిఏ మనోహర్, మండల వ్యవసాయ అధికారీ రామకృష్ణ లు పాల్గొని మాట్లాడారు.
ఎల్మినో ఎఫెక్ట్ కారణంతో వర్షాలు అంతంత మాత్రమే కురిసినందున రైతులకు సాగునీరు, విద్యుత్ సమస్యలు ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసుకోవాలని కోరారు. భూసార పరీక్షల ఆధారంగా పంటలు వేసుకొని పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని, రబి సీజన్ లో శనగలు మినుములు, పెసర్లు ,జొన్న, మొక్కజొన్నలు తదితర తేలికపాటి పంటలు వేసుకోవాలని అన్నారు. ఈ సదస్సులో మోసం పంచాయతీ సర్పంచ్ భీమన్న కార్ పద్మ--వసంతరావు , విస్తరణ అధికారి రహమాన్, ఆత్మ ఏటీఎం శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.