ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు గెలుపు కోసం కృషి చేయాలి..

23-10-2026 | 07:41pm

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య......

యాదగిరిగుట్ట, అక్టోబర్ 23 (విజయక్రాంతి): నల్లగొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) కాంగ్రెస్ పార్టీ(Congress Party) బలపరిచిన అభ్యర్థిని గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు,  ముఖ్యఅతిథిగా ప్రభుత్వ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి  రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పట్టభద్రులను కలిసి అభ్యర్థికి మద్దతు కోరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుల్లపల్లి వాణి భరత్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ చీర శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు