గౌడ కుటుంబాల గ్రామ బహిష్కరణ

23-10-2026 | 07:38pm

గౌడ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా నాయకులు  డిమాండ్ 

సదాశివనగర్,అక్టోబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామంలో కల్లు గీత కార్మిక(Toddy tapper (worker)) కుటుంబాలను గ్రామ సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామ కమిటీ పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లింగా గౌడ్, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సైదగౌని వెంకట్ గౌడ్,జైగౌడ జిల్లా అద్యక్షులు మురళి గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు శుక్రవారం సదాశివనగర్ మండలం తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.అనంతరం మాట్లాడుతూ తిర్మన్ పల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం గౌడ కులస్తులు ను గ్రామ కమిటీ డబ్బులు డిమాండ్ చేసినాట్టు,గౌడ కులస్తులు డబ్బులు ఇవ్వకపోతే గ్రామ బహిష్కరణ చేశరని,గౌడ కులస్తులు తో ఎవ్వరూ మాట్లాడవద్దు, ఎవరు వస్తువులు ఇవ్వకూడదని,ఇస్తే 5 వేల రూపాయలు జరిమానా విధిస్తామని గ్రామంలో చాటింపు వేయించినట్టు తెలిపారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపలకు పాల్పడుతున్నా గ్రామ కమిటీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ విషయం పై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కి కూడా వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో నాయకులు రామా గౌడ్, తిర్మమన్ పల్లి  గీత కార్మికులు స్వామి గౌడ్, మైసాగౌడ్, మల్లా గౌడ్, శ్రావణ్ గౌడ్, లక్షణ్ గౌడ్ చిన్న మైసా గౌడ్, మహెష్ గౌడ్, బాలా గౌడ్ మండల గౌడ సంఘం నాయకులు సాయి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు