పెద్దవాగు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
22-09-2026 | 05:50pm
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): పెద్దవాగు వద్ద గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర ఏర్పాట్లను కాలేశ్వరం జోన్-1(Kaleshwaram Zone-1) డీఐజీ అంబర్ కిషోర్ ఝా, జిల్లా ఎస్పీ నికితా పంత్(District SP Nikita Pant) మంగళవారం పరిశీలించారు. పోలీసు బందోబస్తు, మంచినీటి వసతి, గజ ఈతగాళ్ల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిమజ్జనానికి భారీగా విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన చోట్ల మళ్లింపులు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ, టౌన్, రూరల్ సీఐలు, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.