4 వ రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల నిరసన
17-10-2026 | 10:10pm
కాగజ్ నగర్, అక్టోబర్ 17 ( విజయక్రాంతి) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు జీతాలు చెల్లించాలని చేస్తున్న నిరసన దీక్షలు 4 వ రోజు కొనసాగాయి. శనివారం నాటి దీక్షలకు మున్సిపల్ 7 వార్డ్ కౌన్సిలర్ చెప్పకుర్తి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. 1 నెల జీతం దసరా పండగ లోపు చెల్లించి, అలాగే వారి పీఎఫ్ డబ్బులు రు. 1.50 కోట్ల రూపాయలను కార్మికుల అకౌంట్ల లో వెంటనే జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.