మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ రాములు

17-10-2026 | 11:34pm

మల్లాపూర్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను(Mallapur Police Station) డీఎస్పీ రాములు(DSP Ramulu) శనివారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల వివరాలు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను తనిఖీ(Vehicle inspection) చేసి వాటి వివరాలను పరిశీలించారు.

పెండింగ్ కేసుల పురోగతిపై(Progress of pending cases) ఆరా తీసి, కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు