విద్యార్థులకు ఎంపీడీవో యూనిఫాం, దుస్తులు పంపిణీ
17-09-2026 | 01:24pm
బెజ్జూర్ సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం దుస్తులను ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తో కలిసి గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డాక్టర్ సునీత ,వార్డు సభ్యులు,నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.