కాళికామాత అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శరన్నవరాత్రి ఉత్సవా(Sharannavaratri Celebrations)ల్లో భాగంగా సోమవారం అమ్మవారు కాళికామాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మండపాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గత వారం రోజులుగా వివిధ అవతారాల్లో దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాళికామాత అవతారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు సమర్పించారు. అమ్మవారి కృపతో కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. శరన్నవరాత్రి ఉత్సవాలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.