మహాలక్ష్మి ఆలయంలో కాంగ్రెస్ నేతల పూజలు
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం(Mahalakshmi Temple)లో దుర్గామాతను నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుచాడి శ్రీహరి రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి(Municipal VC Appala Ganesh Chakravarti) దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
అనంతరం ఆలయ పరిసరాల్లో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు ఆలయ కమిటీ చైర్మన్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.