రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నేరేడుచర్ల, నవంబర్ 23(విజయ క్రాంతి): రాఘవాపురం గ్రామానికి చెందిన రేణపంగ స్వర్ణలత (50) రోడ్డు ప్రమాదంలో(Road accident) మృతి చెందింది. నేరేడుచర్ల ఎస్సై సిహెచ్ గోపాల్ రెడ్డి (Nereducherla SI CH Gopal Reddy) తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో స్వర్ణలత తన భర్త భిక్షంతో కలిసి టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోటార్ సైకిల్‌పై కిరాణా సామాన్లు కొనుగోలు చేయడానికి పాలకవీడు మండలంలోని తమ స్వగ్రామం అయిన రాఘవాపురం నుంచి నేరేడుచర్లకు బయలుదేరింది.
దిర్శించర్ల గ్రామ శివారులోని డంపింగ్ యార్డు వద్దకు చేరుకోగానే భిక్షం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న స్వర్ణలత వాహనం పై నుంచి జారి కింద పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.మృతురాలి కుమారుడు రేణపంగ చంద్రపాల్ ఫిర్యాదు మేరకు నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సిహెచ్.గోపాల్‌రెడ్డి తెలిపారు.