చుంచు లక్ష్మయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం

23-11-2026 | 06:30pm

- బీసీ నాయకుడిని అసెంబ్లీకి పంపేందుకు ప్రజలు సిద్ధం

- బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): లక్షెట్టిపేట మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య(former MLA Chunchu Laxmaiah) పోరాట స్ఫూర్తి నేటి బీసీ నాయకులకు ఆదర్శమని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ అన్నారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష్మయ్య జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూస్వామ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మయ్య చరిత్రను యువతకు తెలియజేయాలన్నారు.

తెగువ ఉన్న బీసీ నాయకుడు ముందుకొస్తే ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కర్రే లచ్చన్న, చుంచు గురువయ్య, బేర ప్రభాకర్, దొమ్మటి అర్జున్, బేర పోషం, గడ్డం సతీష్ యాదవ్, దుర్గం రాజేష్ గౌడ్, రజక సంఘ మంచిర్యాల సిటీ ప్రెసిడెంట్ పారిపెళ్లి శ్రీనివాస్, కురుమ సంఘ నాయకులు పొట్టాల మల్లేష్, గోత్రాల సంఘం జిల్లా అధ్యక్షుడు గందశ్రీ తిరుపతి, బీసీ సమాజ్ నాయకులు ఎండి లతీఫ్, శ్రీధర్ రాజ్, కుడుక మోహన్, పెద్దపెల్లి సూరయ్య, ఎండి షఫీ, పల్లపు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు