యువత పెడదారి పట్టకుండా అప్రమత్తంగా ఉండాలి...
బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్..
బాన్సువాడ, నవంబర్ 23 (విజయక్రాంతి): విద్యార్థులు చిన్న వయస్సులోనే చెడు అలవాట్లకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మంచి లక్ష్యంతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని యువత పెడదారి పట్టకుండా, ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్(CI Tula Sridhar urged) పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం పాత బాన్సువాడ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కళాబృందం సభ్యులు మాటలు, పాటల రూపంలో విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను జాగ్రత్తగా వినియోగించాలని, తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
పోక్సో చట్టం, మైనర్లపై జరిగే నేరాలు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాల గురించి పోలీసు సిబ్బంది అనిల్, మహిళా కానిస్టేబుల్ పార్వతి విద్యార్థులకు వివరించారు.అత్యవసర సేవల కోసం సంప్రదించాల్సిన నంబర్లు సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1908,షీ టీమ్ సహాయం కోసం 8712686094,అత్యవసర పోలీసు సేవల కోసం డయల్ 112.ఈ కార్యక్రమంలో పోలీసు కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు.శేషారావు, పోలీసు కానిస్టేబుల్ ప్రభాకర్ పాల్గొని అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.