ఫోటోగ్రాఫర్ల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలి

06-11-2026 | 06:55pm

ఆసిఫాబాద్, నవంబర్ 06 (విజయక్రాంతి): జిల్లాలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల అభివృద్ధి, సంక్షేమం, సంఘ బలోపేతంపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుస్సేన్(State President Sheikh Hussain) హాజరై పలు సూచనలు చేశారు. ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సభ్యుల ఐక్యత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. సమీర్, వావిలాల రాజు, మండల అధ్యక్షులు సందీప్, వివేక్, హమీద్‌తో పాటు పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు