మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

06-11-2026 | 07:55pm

జగిత్యాల, నవంబర్ 06 ( విజయక్రాంతి ): జగిత్యాల మండల పరిషత్ కార్యాలయం(Jagtial Mandal Parishad Office) లో అర్బన్ మండల అభివ్రుద్ది కార్యక్రమాల పై మండల స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎల్ నీ నో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వరి సాగు విషయం లో రైతులు ఆలోచన చేయాలని, అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఆరుతడి పంటలు పండించే విదంగా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.

వరి కోతలు ప్రారంభం అయ్యాయి. మధ్యవర్తుల ను నమ్మి రైతులు మోసపోవద్దు, మద్దతు ధర, మార్కెట్ డిమాండ్ ధర పరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనీ తెలిపారు. గతంలో మార్క్ ఫెడ్ 10వేల కోట్ల నష్టాల్లో ఉండేదని గత ఏడాది కొంత లాభాలు వచ్చాయి అని అన్నారు. పంట పొలాలకు నీరు ఇచ్చే పరిస్తితి లేదు. త్రాగు నీటి అవసరాలకు మాత్రమే నీరు ఉంది. సెర్ప్ విషయంలో జగిత్యాల మండలానికి జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను.

మహిళల కు న్యాయం చేస్తానని, జగిత్యాల మండల మహిళ సంఘం భవనానికి జిల్లా కేంద్రంలో స్తలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. విభీజిరామ్  లో రైతు పంట పొలాలు కాలువల్లో నీటి సరఫరా కు పనులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో ప్రభుత్వ నిబంధనలు పై ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు గ్రామ కార్యదర్శిల అవగాహన కల్పించాలని సూచించారు. 

ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డి ఎం ఓ షాబొద్దీన్, ఇంచార్జి ఎంపిడిఓ వాసవి, ఏ ఎం సీ చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, ఎమ్మార్వో రామ్మోహన్ ఫ్యాక్స్ చైర్మెన్ కొలుగూరి దామోదర్ రావు, సర్పంచులు సంగేపు మహేష్, గోడిసెల గంగాధర్, దావా తిరుపతి, శీలం సురేందర్, దమ్మరాజవ్వ, మల్లారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు