ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి
డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గేడం టీకానంద్
ఆసిఫాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(Special Summary Revision of Electoral Rolls) (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రద్దు చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గేడం టీకానంద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా(Asifabad District) కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును పరిరక్షించాలని, ఓట్ల తొలగింపునకు(Deletion of votes) బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Chief Election Commissioner Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ల(Ballot papers) ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరి సతీష్, కమిటీ సభ్యుడు తాళ్లపల్లి రాజేశ్వర్, నాయకులు బోర్కుంట బాబ్లు, హరీష్, శ్రావణ్ కుమార్, పెద్ది అరవింద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.