అడవి పంది దాడిలో ఒకరికి గాయాలు
03-10-2026 | 05:19pm
కౌటాల: హుల్కే సాధన్ మొగడ్‌ధగడ్‌కు చెందిన రైతు(Farmer) తన స్వంత చేనుకు వెళ్తుండగా బాలేపల్లి సమీపంలో అడవి పంది(Wild Boar) అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. అడవి పంది దాడితో భయాందోళనకు గురైన బాధితుడిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అడవి పందుల సంచారం పెరగడంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. అటవీ అధికారులు స్పందించి అడవి పందుల బెడదను నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు.