వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్
బెజ్జూర్, అక్టోబర్ 3,(విజయక్రాంతి): వన్యప్రాణి వారోత్సవాల్లో(Wildlife Week Celebrations) భాగంగా మంగళవారం బెజ్జూర్ మండల కేంద్రంలో వన్యప్రాణుల పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్(Range Officer Shravan Kumar) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, పాఠశాల విద్యార్థులు "వన్యప్రాణులను రక్షిద్దాం - పర్యావరణాన్ని కాపాడుదాం" అంటూ నినాదాలు చేస్తు వీధుల గుండా ర్యాలీ సాగింది.
వన్యప్రాణుల ప్రాముఖ్యత, వాటిని వేటాడడం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రేంజ్ అధికారి శ్రవణ్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు మనోహర్, సఫియా బేగం, సంతోష్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులకు వన్యప్రాణి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.