కామారెడ్డి ఓటమి గుర్తుందా రేవంత్? : పాయల్ శంకర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(BJP MLA Payal Shankar) తీవ్ర విమర్శలు చేశారు. కామారెడ్డిలో ఎదురైన ఓటమిని సీఎం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీని విమర్శించడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని, రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను బీజేపీ గెలుచుకుందని గుర్తుచేశారు. రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యలపై చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనతో కాంగ్రెస్లో భయం మొదలైందని పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరని విమర్శించారు.