పెద్దమల్లారెడ్డి జెడ్పీహెచ్‌ఎస్‌లో అక్షర కార్యక్రమం

27-09-2026 | 06:26pm

భిక్కనూర్, సెప్టెంబర్‌ 27 (విజయ క్రాంతి): భిక్కనూర్‌ మండలం(Bhikkanur Mandal) పెద్దమల్లారెడ్డి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో(ZPHS School) ఆదివారం అక్షర కార్యక్రమం(Akshara Programme) నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కోడూరు సాయిగౌడ్‌(Sarpanch Koduru Sai Goud), ఉపసర్పంచ్‌ పట్లూరి చైతన్య, కొండల్‌రెడ్డి, వార్డు సభ్యురాలు నడిపొల్ల శ్యామల రామస్వామి, గ్రామ సంఘ అధ్యక్షురాలు, సీఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చదువు ప్రాముఖ్యత, విద్య ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు