హైదరాబాద్‌ చేరుకున్న రాహుల్ గాంధీ

14-11-2026 | 06:44am

హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. శంషాబాద్‌లో ఘన స్వాగతం!

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, పార్టీ నేతలు రాహుల్‌కు ఆత్మీయ Welcome పలికారు.

ఈ పర్యటనలో రాహుల్ గాంధీకి పలు కీలక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ హైటెక్స్ పరిసరాల్లో నిర్వహించే Gig Workers Rallyలో ఆయన పాల్గొని గిగ్ వర్కర్లతో నేరుగా మాట్లాడనున్నారు. వారి సమస్యలు, ఉద్యోగ భద్రత, Social Security, Welfare Schemes వంటి అంశాలపై చర్చించనున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన ప్రకటనలు చేసే అవకాశం కూడా ఉంది.

మరోవైపు హైదరాబాద్‌లో జరుగుతున్న Bharat Summit కార్యక్రమానికి కూడా రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొంటున్న ఈ సదస్సులో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధి, Global Politics వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. దీంతో రాహుల్ హైదరాబాద్ పర్యటనలో గిగ్ వర్కర్ల సమావేశం, భారత్ సమ్మిట్ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.

మరిన్ని వార్తలు