ఏపీతో నమస్తే వరల్డ్ ఎంవోయూ

14-11-2026 | 05:00am

రూ.36.24 కోట్ల ఒప్పందం

1,050 మందికి ఉపాధి

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): నటుడు, వ్యాపారవేత్త మంచు మ నోజ్, భూమా మౌనికా మంచు స్థాపించిన హైదరాబాద్‌కు చెందిన నమస్తే వరల్డ్(Namaste World) సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రూ.36.24 కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ ఒప్పందం జరిగింది.

కర్నూలు, విశాఖపట్నంలో చేనేత, దుస్తులు, బొమ్మల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,050 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నా యి. నమస్తే వరల్డ్ వ్యవస్థాపకురాలు, ము ఖ్య కార్యనిర్వహణాధికారి భూమా మౌనికా మంచు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృ తి, సంప్రదాయ హస్తకళలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు.  సంస్థ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య ఆవిష్కరణల అధికారి మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీలో కృత్రి మ మేధ స్సు, రోబోటిక్స్ సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ప్రముఖ సాంకేతిక సంస్థలతో చర్చిస్తున్నామన్నారు.

‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే తమ ఆకాంక్ష అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నమ స్తే వర ల్డ్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచ యం చేసే సంస్థ విధానాన్ని  ప్రశం సించా రు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ స్థా నిక కళాకారులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నా రు. ఏపీ చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి మాట్లాడుతూ.. చేనేత కార్మికులను ఆధునిక మార్కెట్లతో అనుసంధానించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. 

మరిన్ని వార్తలు