విమాన సర్వీసులకు అంతరాయం
మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్ ఎఫెక్ట్
మైక్రోసాఫ్ట్ (Microsoft) గ్లోబల్ అవుటేజ్ ప్రభావం భారత్‌లో విమాన సర్వీసులపై పడటం ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య(Microsoft technical issue) కారణంగా ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన మూడు విమానాలను రద్దు చేసినట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఇతర విమానయాన సంస్థలు ఎలాంటి అంతరాయాలను ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ Flight Statusను పరిశీలించుకోవాలని సూచించాయి. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన మూడు స్పైస్‌జెట్ విమానాలు రద్దయ్యాయి. వీటిలో ఢిల్లీ నుంచి పుణె, ఢిల్లీ నుంచి లేహ్, ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. మరో రెండు స్పైస్‌జెట్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి దర్భంగా, ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానాలు ఈ జాబితాలో ఉన్నాయి.
మరోవైపు మైక్రోసాఫ్ట్ అవుటేజ్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదని, కమ్యూనికేషన్ వ్యవస్థలు సాధారణంగానే పనిచేస్తున్నాయని తెలిపింది. ప్రయాణికుల నుంచి వచ్చే ఈమెయిల్స్ నిరంతరాయంగా అందేలా తాత్కాలికంగా Email Trafficను మరో మార్గానికి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. తమకు వచ్చే ఈమెయిల్స్‌కు సాధారణంగా పాటించే 24 గంటల వ్యవధిలోనే సమాధానాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు జారీ చేసిన తాజా సూచనల ప్రకారం.. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందే తమ విమాన స్థితిగతులను చెక్ చేసుకోవాలి. ఇండిగో, ఆకాసా ఎయిర్ సంస్థలు కూడా ప్రయాణికులకు Advisory జారీ చేశాయి. విమానాలకు సంబంధించిన సమాచారం, తాజా Updatesను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించాయి. ఢిల్లీ విమానాశ్రయం కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేక సూచనలు విడుదల చేసింది.
మైక్రోసాఫ్ట్ సేవల్లో అసలు సమస్య ఏమిటి?
గురువారం మైక్రోసాఫ్ట్‌కు చెందిన పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విస్తృత స్థాయిలో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా Outlook ఈమెయిల్ సేవలను వినియోగించడంలో చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు. సంస్థకు చెందిన ఇతర Applicationsలోనూ ఎర్రర్లు కనిపించాయి. ఈ సమస్యలపై దర్యాప్తు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ముఖ్యంగా Email, Teams అప్లికేషన్లలో తలెత్తిన అంతరాయాలపై దృష్టి సారించినట్లు తెలిపింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో వినియోగదారులు వివిధ మార్గాల ద్వారా Exchange Online Mailboxesను యాక్సెస్ చేయలేకపోతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఈ సమస్యకు గల కారణాలపై మైక్రోసాఫ్ట్ వెంటనే పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే సమస్యను పరిష్కరించేందుకు Fixను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులపై ప్రభావాన్ని వీలైనంత త్వరగా తగ్గించేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని మైక్రోసాఫ్ట్ 365 Status ఖాతా సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.