నడినదిలో పెను ప్రమాదం

14-11-2026 | 07:59am

అమెరికాలో భారీ నౌకా ప్రమాదం.. క్రూయిజ్ షిప్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్!

న్యూ ఓర్లీన్స్: అమెరికాలోని మిసిసిపీ నదిలో భారీ నౌకా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో కూడిన క్రూయిజ్ షిప్‌ను ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ Collision కారణంగా American Heritage అనే పర్యాటక నౌక తీవ్రంగా దెబ్బతిని పాక్షికంగా నీటిలో మునిగిపోయినట్లు సమాచారం. మరికొన్ని నివేదికల్లో నౌక బోల్తా పడినట్లు పేర్కొన్నప్పటికీ, దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. Atlantic Asphalt అనే ఆయిల్ ట్యాంకర్, మిసిసిపీ నదిలో నిలిపి ఉంచిన American Heritage క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టింది. ప్రమాదానికి సుమారు రెండు గంటల ముందే ఆ నౌక డాక్ వద్ద నిలిచింది. ప్రయాణికులను కిందకు దించే ప్రక్రియ (Disembarkation) ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ క్రూయిజ్ షిప్‌లో సుమారు 129 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు Rescue Operation ప్రారంభించారు. పలువురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు న్యూ ఓర్లీన్స్ మేయర్ హెలెనా మోరెనో కార్యాలయం వెల్లడించింది. ప్రయాణికులను Port of New Orleans పరిపాలనా భవనానికి తరలించి Triage నిర్వహించారు. అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

మరోవైపు ప్రమాద తీవ్రత దృష్ట్యా US Coast Guard కీలక చర్యలు చేపట్టింది. మిసిసిపీ నదిలో 93 నుంచి 96 మైల్ మార్కర్ల మధ్య నౌకల రాకపోకలను నిలిపివేసింది. Search and Rescue Operation కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కొందరు ప్రయాణికులు నదిలో పడిపోయినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు? ప్రయాణికులందరినీ గుర్తించారా? క్రూయిజ్ షిప్ పూర్తిగా బోల్తా పడిందా లేక పాక్షికంగా నీటిలో మునిగిందా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ట్యాంకర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందా? లేక ప్రమాదానికి మరో కారణం ఉందా? అనే కోణంలోనూ వివరాలు తెలియాల్సి ఉంది. మార్షల్ దీవుల్లో రిజిస్టర్ అయిన Atlantic Asphalt ట్యాంకర్ యాజమాన్యానికి సంబంధించి చైనా, లైబీరియా కంపెనీల పేర్లు పబ్లిక్ రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం. అధికారిక దర్యాప్తు పూర్తయితేనే ప్రమాదానికి అసలు కారణం వెల్లడికానుంది.


మరిన్ని వార్తలు