నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నిరసన

08-09-2026 | 11:32am

కేసముద్రం (విజయక్రాంతి): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం(Kesamudram) పట్టణంలో మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలిపారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు