16 August, 2026 | 8:52 AM

Districts - Mahabubabad

article_69134983.webp
ఉత్తమ సేవలకు డీ టీకి ప్రభుత్వ ప్రశంస

కేసముద్రం (విజయక్రాంతి): విశిష్టమైన సేవలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఉప తహసిల్దార్ ఎర్రయ్య ప్రభుత్వం నుంచి పంద్రాగస్టు సందర్భంగా ప్రశంసలకు ఎంపికయ్యారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, కలెక్టర్ స్నేహ శబరిష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. కేసముద్రం మండల పరిధిలో రెవెన్యూ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం, ప్రతిష్టాత్మకమైన నారాయణపురం గ్రామ రైతులకు పెండింగ్లో ఉన్న వ్యవసాయ భూములకు పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయడంలో కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వం నుండి ప్రశంస పత్రం అందుకున్న ఎర్రయ్యకు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

15-08-2026

article_41864452.webp
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

కేసముద్రం, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపాలిటీలో చైర్పర్సన్ బానోత్ సునీత,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ వివేక్, పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ క్రాంతి కిరణ్, ధనసరి సొసైటీ కార్యాలయంలో చైర్మన్ మర్రి రంగారావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓ హరీష్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో వెంకన్న జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అలాగే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు, ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

15-08-2026

article_43001619.webp
‘బోనాల’ సంబరం.. ముత్యాలమ్మ జాతరకు సర్వం సిద్ధం

కేసముద్రం, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఆదివారం కనివిని ఎరగని రీతిలో బోనాల పండుగ నిర్వహించడానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్‌పర్సన్ అల్లం రమ నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కళాకారుల ఆటపాటలు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పిలుపునిచ్చారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఏడాది బోనాల జాతరను చరిత్రలో నిలిచిపోయేలా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీ సర్వం సిద్ధం చేసింది.

15-08-2026