తొలి బేరం అ‘ధర’హో.!

05-10-2026 | 03:59pm

మద్దతుకు మించి మక్కలకు ధర

కేసముద్రం,(విజయక్రాంతి): వానాకాలంలో మక్కజొన్న పంట(Maize crop) సాగు చేసిన రైతులకు పంట దిగుబడి సిరులు కురిపిస్తోంది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో(Kesamudram agricultural market) వాన కాలంలో పండిన మక్కజొన్న పంట ఉత్పత్తుల విక్రయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మార్కెట్కు 1500 బస్తాల మక్క జొన్నలను రైతులు విక్రయానికి తెచ్చారు. గరిష్టంగా క్వింటాలుకు 2,618 రూపాయల ధర లభించింది. ప్రభుత్వం మక్కలకు 2,410 మద్దతు ధర ప్రకటించగా, మద్దతుకు మించి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు