ఆరోగ్యమే మహాభాగ్యం

01-10-2026 | 11:38am

మహమ్మదాబాద్,సెప్టెంబర్ 30(విజయక్రాంతి): మండల పరిధిలోని రుసుంపల్లి గ్రామంలో మహమ్మదాబాద్ (𝗣𝗛𝗖) ప్రైమరీ హెల్త్ సెంటర్. వైద్యుల ఆధ్వర్యంలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా పల్లె దవఖాన  వైద్యులు.నిఖిల్ రెడ్డి, గ్రామస్తులకు ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్థానిక సర్పంచ్ పోతగల గౌరమ్మ.చేసిన చొరవపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, అంజమ్మ. వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, గ్రామ పెద్దలు,యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు