ఇషాన్ వీరబాదుడు.. భారత్ అదిరే స్కోర్!

01-10-2026 | 11:43am

ఆసియా గేమ్స్‌ 2026లో(Asian Games 2026) శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్‌లో(India vs Sri Lanka semifinal) టీమిండియా అదిరే స్కోర్ నమోదు చేసింది. టాస్‌ అనంతరం తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యర్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు(India 169/7) చేసింది. దీంతో ఫైనల్ బెర్త్ కోసం శ్రీలంక ముందు 170 పరుగుల టార్గెట్ నిలిచింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్(ishan kishan) విధ్వంసక బ్యాటింగ్‌తో 80 పరుగులు చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు.

మరోవైపు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) 38 పరుగులతో కీలక సహకారం అందించాడు. మధ్యలో వికెట్లు పడుతున్నా భారత బ్యాటర్లు స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. ఇప్పుడు 170 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ఛేదిస్తుందా.. లేక భారత బౌలర్లు మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటారా అన్నది ఉత్కంఠగా మారింది. ఫైనల్ టికెట్ కోసం కీలకమైన ఈ పోరులో శ్రీలంకకు(IND vs SL) ప్రతి ఓవర్ కీలకమే. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని టీమిండియా గోల్డ్ మెడల్(Team India Gold Medal) మ్యాచ్‌కు దూసుకెళ్తుందా అనేది మరికొద్దిసేపట్లో తేలనుంది.

మరిన్ని వార్తలు