స్పష్టమైన లక్ష్యంతో అడుగులు వేయాలి

10-09-2026 | 08:29pm

గిరిజన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి

మహబూబ్‌నగర్: బోయపల్లి గేట్‌లోని విష్ణు కన్వెన్షన్ హాల్‌లో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివిఎస్ రవీందర్ నాయక్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణ, సమయపాలనతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు